తెలంగాణ ప్రకటనపై అద్వానీ స్పందన
కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై విస్పష్ట ప్రకటన చేయడం పట్ల బీజేపీ సీనియర్ నేత అద్వానీ స్పందించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తమ భాగస్వామ్య పక్షాల కారణంగా గతంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోలేకపోయామని వివరించారు. ఇక, కాంగ్రెస్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజల మనోభావాలను గౌరవించడమే అని పేర్కొన్నారు.